ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్ట్ కు 20 లక్షల విరాళం
తిరుమల తిరుపతి దేవస్థానం అన్న ప్రసాదం నిర్వహణకు విరాళాలు ఇచ్చేందుకు దాతలు ముందుకు వస్తున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం అన్న ప్రసాదం నిర్వహణకు విరాళాలు ఇచ్చేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. తరిగొండ వెంగమాంబ నిత్యాన్న దాన సత్రంలో రోజుకు యాభై వేల నుంచి అరవై వేల మంది వరకూ ఉచితంగా అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తారు. ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం, సాయంత్రం వేళ్లలో భోజనం అందచేయనున్నారు.
ఇద్దరు భక్తులు...
అయితే తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన వెంకటరమణ అన్నప్రసాదం ట్రస్ట్ కు పది లక్షల రూపాయలులు సోమవారం విరాళంగా అందజేశారు. తిరుపతికి చెందిన భక్తుడు సాధు పృథ్వీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్ కు పది లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు. దాతలు సంబంధిత డిడిలను అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకన్న చౌదరికి తిరుమలలో సోమవారం అందజేశారు.