Tirumala : ఈ ఏడాదికి తిరుమలకు అందిన విరాళాలు ఎంతో తెలుసా?

తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ ఏడాది భారీగా విరాళాలు అందాయి

Update: 2025-10-21 07:29 GMT

తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ ఏడాది భారీగా విరాళాలు అందాయి. దాతలు ముందుకు వచ్చి టీటీడీ ఆధ్వర్యంలో సాగుతున్న అనేక ట్రస్ట్ లకు భారీ విరాళలను అందించాయి. గడిచిన పదకొండు నెలల్లో రికార్డుస్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానానికి 918.6 కోట్ల రూపాయల విరాళాల అందినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఆన్‌లైన్‌ ద్వారా రూ.579.38 కోట్ల రూపాయలు, ఆఫ్‌లైన్‌ ద్వారా రూ.339.20 కోట్ల విరాళాలు అందినట్లు అధికారులు తెలిపార.

వివిధ ట్రస్ట్ లకు...
అత్యధికంగా తిరుమలలోని అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.338.8 కోట్ల విరాళాలు లభించాయని అధికారులు తెలిపారు. శ్రీవాణి ట్రస్ట్‌కు 252.83 కోట్ల రూపాయల విరాళాలు అందినట్లు పేర్కొన్నారు. ఎస్వీ విద్యాదాన ట్రస్ట్‌కు రూ.33.47 కోట్లు, బర్డ్‌ ట్రస్ట్‌కు రూ.30.02 కోట్లు, ఎస్వీ సర్వశ్రేయాస్‌ ట్రస్ట్‌కు రూ.20.46 కోట్లు, ఎస్వీ వేదపరిరక్షణ ట్రస్ట్‌కు రూ.13.87 కోట్లు, ఎస్వీబీసీకి రూ.6.29 కోట్ల విరాళాలు, స్విమ్స్‌కు రూ.1.52 కోట్ల విరాళాలు అందినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు


Tags:    

Similar News