Turakapalem : తురకపాలెం మరణాలపై జిల్లా కలెక్టర్ ఏమన్నారంటే?

గుంటూరు జిల్లా తురకపాలెంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పర్యటించారు

Update: 2025-10-07 03:31 GMT

గుంటూరు జిల్లా తురకపాలెంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పర్యటించారు. తురకపాలెం ఆరోగ్య స్థితి గతుల పట్ల ప్రతీ రోజూ పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. *తురకపాలెం ఆరోగ్య సంరక్షణకు నిలయం కావాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అనారోగ్య పరిస్థితులు నియంత్రణకు స్థానికులు భాగస్వామ్యం కావాలని కోరారు. ఆరోగ్య స్థితి గతుల సమాచారం పక్కాగా అందించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

అభివృద్ధి పనులకు...
ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలని, చివరి పరిస్థితుల్లో ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో చేరటం జరుగుతోందని కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. తురకపాలెం*గ్రామంలో 102 మందికి బిపి, 69 మందికి మధుమేహం ఉన్నట్లు ఎన్.సి.డి సర్వేలో గుర్తించామన్న కలెక్టర్ ఇక ముందు ఒక్క మరణం కూడా సంభవించకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అభివృద్ధి పనులకు, వేడుకలకు తురకపాలెం నిలయం కావాలని, ప్రభుత్వ పరంగా అన్ని సౌకర్యాలు అందేటట్లు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.


Tags:    

Similar News