నేడు జగన్ వద్దకు ఉద్యోగ సంఘాలు

ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య చర్చలు నేడు కూడా జరగనున్నాయి. ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి జగన్ తో సమావేశమయ్యే అవకాశముంది.

Update: 2021-12-16 01:31 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య చర్చలు నేడు కూడా జరగనున్నాయి. ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి జగన్ తో సమావేశమయ్యే అవకాశముంది. నిన్న దాదాపు ఆరు గంటల పాటు జరిగిన చర్చల్లో ఎటువంటి పురోగతి లేదు. చీఫ్ సెక్రటరీ కమిటీ 14.3 శాతం ఫిట్ మెంట్ సూచిస్తే, ఉద్యోగ సంఘాలు 48 శాతం డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం దీనిపై కొంత అసహనంగా ఉన్నట్లు సమాచారం.

ప్రభుత్వంలో అసహనం.....
రాష్ట్ర ఆర్థిక పరిస్థిితి తెలిసి కూడా ఉద్యోగ సంఘాలు మొండి పట్టు పడుతుండటాన్ని ప్రభుత్వం తప్పుపడుతుంది. బడ్జెట్ లో ఎక్కువ శాతం ఉద్యోగుల జీతభత్యాలకే వెళుతున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది. ఈరోజు మరోసారి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డిలతో చర్చలు పూర్తయిన తర్వాత జగన్ తో ఉద్యోగ సంఘాల భేటీ జరిగే అవకాశముంది.


Tags:    

Similar News