Andhra Pradesh : ఏపీలో ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్.. ఇక్కడ పిడుగులు

ఆంధ్రప్రదేశ్ లో మరికొద్ది గంటల్లో భారీ వర్షాలు పడతాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

Update: 2025-10-04 12:26 GMT

ఆంధ్రప్రదేశ్ లో మరికొద్ది గంటల్లో భారీ వర్షాలు పడతాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మూడు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది.విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక జారీ చేసింది.

ఈ జిల్లాల్లో పిడుగులు...
ఉత్తరాంధ్ర జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ను ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ జారీ చేసింది. అల్లూరి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. తీరం వెంట బలమైన ఈదురుగాలులు వీస్తాయని కూడా తెలిపింది. గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. ఎవరూ చెట్ల క్రింద ఉండవద్దని, అప్రమత్తంగా ఉండాలని , వీలయినంత వరకూ ఇంట్లోనే ఉండి సురక్షితంగా ఉండాలంటూ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.


Tags:    

Similar News