TDP : నంద్యాల జిల్లా టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
నంద్యాల జిల్లా టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎంపీ బైరెడ్డి శబరి, శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది
నంద్యాల జిల్లా టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఎంపీ బైరెడ్డి శబరి, శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరి శ్రీశైలం నియోజకవర్గంలో పర్యటించేందుకు మాజీ ఎమ్మెల్యే ఏరాసు ప్రతాప్ రెడ్డితో కలసి వచ్చారు. అయితే సుపరిపాలన - తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన బైరెడ్డి శబరిని రాజశేఖర్ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు.
ఎమ్మెల్యేకు తెలియకుండా...
ఎమ్మెల్యేకు తెలియకుండా ఎలా పార్లమెంటు సభ్యులు పర్యటిస్తారని రాజశేఖర్ రెడ్డి వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తడంతో పోలీసులు బైరెడ్డి శబరికి సర్దిచెప్పి వెనక్కు పంపేశారు. దీనికి ప్రధాన కారణం మాజీ ఎమ్మెల్యే ఏరాసు ప్రతాప్ రెడ్డి కారణమంటూ శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి అనుచరులు ఆయన ఇంటిపై దాడికి దిగారు. అద్దాలు పగలకొట్టారు. పోలీసులు జోక్యం చేసుకుని కార్యకర్తలను చెదరగొట్టారు.