Andhra Pradesh : ఏపీలో డయేరియా కలకలం.. ఒకరు మృతి.. మరికొందరు?
ఆంధ్రప్రదేశ్ లో డయేరియా అనేక ప్రాంతాల్లో ప్రజలను ఇబ్బంది పెడుతుంది. అతిసార వ్యాధితో ప్రజలు ఆసుపత్రుల్లో చేరుతున్నారు
ఆంధ్రప్రదేశ్ లో డయేరియా అనేక ప్రాంతాల్లో ప్రజలను ఇబ్బంది పెడుతుంది. అతిసార వ్యాధితో ప్రజలు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. అత్యధికంగా ఆసుపత్రుల్లో చేరుతుండటంతో ఈరోజు మంత్రులు నారాయణ, సత్యకుమార్ యాదవ్ లు డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. కొన్ని చోట్ల కలుషితమైన నీటిని తాగి మరణించారని, మరికొన్ని చోట్ల వివిధ కారణాల వల్ల డయేరియా వ్యాపించిందని అధికరులు తెలిపారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో డయేరియా కారణంగా ఒకరు మరణించారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో...
జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటికే డయేరియా రోగులతో కిటికటలాడుతుంది. పేషెంట్లకు సరైన సేవలను అందించడానికి వైద్యులు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని ఎనిమిది గ్రామాలకు డయేరియా వ్యాధి సోకిందని, అందరూ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్లేనని వైద్యులు తెలిపారు. ప్రజలు అందరూ కాచి వడబోచిన నీటినే తాగాలని అధికారులు సూచిస్తున్నారు. కలుషిత నీరు కారణంగానే డయేరియా వ్యాపించిందని చెబుతున్నారు.