లిక్కర్ స్కాం కేసులో సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో ఇద్దరికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో ఇద్దరికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ధనంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమకు ఈ స్కామ్ తో సంబంధం లేదని, కేవలం గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్నామని తమపై తప్పుడు కేసులు బనాయించారంటూ వారు పిటీషన్ లో పేర్కొన్నారు.
ముందస్తు బెయిల్ పిటీషన్ ను...
అయితే ఈ పిటీషన్ ను పరిశీలించిన సుప్రీంకోర్టు దానిని డిస్మిస్ చేసింది. ముందస్తు బెయిల్ ఇవ్వలేమని చెప్పింది. కేసు దర్యాప్తులో ఉండగా ముందస్తు బెయిల్ ను ఇవ్వలేమని పేర్కొంది. కాగా నేడు స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ లు విచారించనుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో వారిని అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది.