రద్దీ ఎక్కువే.. 20 కంపార్టుమెంట్లలో భక్తులు

బుధవారం స్వామివారి దర్శనార్థం 20 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి 10 గంటల సమయం..

Update: 2023-05-24 03:35 GMT

rush in tirumala today

తిరుమలలో నేడు భక్తుల రద్దీ అధికంగా ఉంది. విద్యార్థులకు వేసవి సెలవులు మరికొద్దిరోజుల్లో ముగియనుండటంతో..శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపిన వివరాల మేరకు.. బుధవారం స్వామివారి దర్శనార్థం 20 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. మంగళవారం (మే23) స్వామివారిని 75,875 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

34,439 మంది తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.07 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. కాగా.. నేడు జులై, ఆగస్టు కోటాకు సంబంధించిన రూ.300 దర్శనం టికెట్లను టీటీడీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ తెలిపింది.


Tags:    

Similar News