శనివారం.. అయినా తిరుమలలో భక్తుల రద్దీ తక్కువే

ఇక శుక్రవారం 63,055 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 23,044 మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారికి..

Update: 2022-12-24 03:14 GMT

ఏడుకొండలపై కొలువై ఉన్న కలియుగ దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. వారాంతంలో.. శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. కానీ.. నేడు మాత్రం భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. శ్రీవారి దర్శనం కోసం 6 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుంది.

ఇక శుక్రవారం 63,055 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 23,044 మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారికి రూ.3.99 కోట్లు హుండీ ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. అలాగే.. నిన్న వైకుంఠ దర్శనం టికెట్లను విడుదల చేసింది టిటిడి. ప్రతిరోజూ 2000 టికెట్లను అందుబాటులో ఉంచనుంది. భక్తులు 10,000 విరాళంతో పాటు రూ.300 టికెట్టుకు చెల్లించాల్సి ఉంటుంది.


Tags:    

Similar News