Indrakiladri : నేడు దుర్గాదేవిగా దర్శనం

ఇంద్రకీలాద్రిపై భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఈరోజు దుర్గాదేవిగా దర్శనమిస్తుండటంతో భక్తులు తరలి వస్తున్నారు

Update: 2023-10-22 03:13 GMT

ఇంద్రకీలాద్రిపై భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఈరోజు దుర్గాదేవిగా దర్శనమిస్తుండటంతో పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. తెల్లవారు జాము నుంచే భక్తులతో క్యూ లైన్నీ నిండిపోయాయి. ఈరోజు దుర్గమ్మను దర్శించుకోవడం విశేషంగా భావిస్తారు. ఎరుపు రంగు చీరలో దుర్గమాత భక్తులకు దర్శనమిస్తుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, మంచినీటి సదుపాయాన్ని ఆలయ కమిటీ కల్పించింది. క్యూ లైన్లలో దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు నాలుగు నుంచి ఐదు గంటల వరకూ అమ్మవారి దర్శనం పడుతుంది.

భక్తులతో నిండిపోయిన....
రేపటితో దసరా నవరాత్రులు ముగియనుండటం, వరస సెలవులు రావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కొండ మీదకుక ఎలాంటి ప్రయివేటు వాహనాలను రాకపోకలకు అనుమతివ్వడం లేదు. కిందనే పార్కింగ్ చేసుకుని బస్సుల్లో భక్తులు వెళ్లాలని పోలీసులు చెబుతుండటంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ఇబ్బంది పడుతున్నారు. దుర్గమ్మను నవరాత్రుల్లో సందర్శించుకుని తమ మొక్కులు తీర్చుకోవడం అలవాటు కావడంతో ఎక్కువ మంది భక్తులు నేడు, రేపు ఇంద్రకీలాద్రికి చేరుకుంటారన్న అంచనాలు వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News