Pawan Kalyan : నేడు పిఠాపురానికి పవన్ కల్యాణ్
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రజల నుంచి ఫిర్యాదులను తీసుకంటారు. చాలా రోజుల తర్వాత పవన్ తన సొంత నియోజకవర్గమైన పిఠాపురం నియోజకవర్గానికి వస్తుండటంతో అధికారులతో పాటు పార్టీ నేతలు కూడా భారీ ఏర్పాట్లు చేశారు.
రచ్చబండ కార్యక్రమంలో...
ప్రజల నుంచి రచ్చబండ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ ఫిర్యాదులను స్వీకరించనున్నారు. దీంతో పాటు పిఠాపురం నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రితో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపాని కూడా శంకుస్థాపన చేయనున్నారు. అలాగే గొల్లప్రోలు, చేబ్రోలు సీతారామ స్వామి దేవస్థానాలకు కూడా పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేస్తారు. దీంతో ఈ కార్యక్రమాలకు పెద్దయెత్తున పార్టీ నేతలు, అభిమానులు హాజరు కానున్నారు.