పవన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారా?

నాలుగు రోజులు పాటు ఇన్ చార్జ్ ముఖ్యమంత్రి గా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టనున్నారు

Update: 2025-07-14 12:09 GMT

నాలుగు రోజులు పాటు ఇన్ చార్జ్ ముఖ్యమంత్రి గా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన నేపథ్యంలో పవన్ కి ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించినున్నట్లు తెలిసింది. ఈ నెల 26 నుంచి 30 వరకు సింగపూర్‌లో సీఎం చంద్రబాబు బృందం టూర్ కు వెళ్లనుంది. సింగపూర్ లో పర్యటించి రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులతో పాటు పరిశ్రమల ఏర్పాట్లు, అమరావతి రాజధాని నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వం భాగస్వామిగా ఉండాలని కోరేందుకు చంద్రబాబు ఈ పర్యటన చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంట నారా లోకేశ్ తో పాటు పలువురు మంత్రులు కూడా సింగపూర్ కు వెళ్లనున్నారు.

అధికారిక ప్రకటన రాకపోయినా...?
దీంతో ఐదు రోజుల పాటు ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో ఉండనుండటంతో ఇన్ ఛార్జి ముఖ్యమంత్రి గా పవన్ కల్యాణ్ బాధ్యతలను చేపట్టనున్నారని తెలిసింది. అయితే దీనికి సంబంధించిన అధికారిక పర్యటన మాత్రం రాలేదు. గతంలో చంద్రబాబు నాయుడు తన పుట్టిన రోజు వేడుకలకు విదేశాలకు వెళ్లినప్పుడు కూడా ఇలాంటి బాధ్యతలను అప్పగించలేదని కొందరు గుర్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఇన్ ఛార్జి ముఖ్యమంత్రి గా బాధ్యతలను నిర్వర్తించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.


Tags:    

Similar News