వంతెన కూలడం దురదృష్టకరం : పవన్ కల్యాణ్
భారీ వర్షాలతో సిద్ధవటం-బద్వేలు మార్గంలో వంతెన కూలడం దురదృష్టకరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు
భారీ వర్షాలతో సిద్ధవటం-బద్వేలు మార్గంలో వంతెన కూలడం దురదృష్టకరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఆ ప్రాంతాల గ్రామాల ప్రజల ఇబ్బందులపై ప్రభుత్వం దృష్టికి వచ్చిందని పవన్ తెలిపారు. వంతెన కూలిన ఘటన గురించి తెలియగానే అక్కడి పరిస్థితులపై అధికారులను ఆరా తీశానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
త్వరగా మరమ్మత్తులు...
వీలైనంత త్వరగా మరమ్మతులు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారని పవన్ కల్యాణ్ చెప్పారు. అప్పటి వరకూ కొంత ఓపిక పట్టాలని, స్థానిక ప్రజలు సహకరించాలని కోరుతున్నానని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోరారు. ఇటీవల గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వంతెన కూలడంతో ఆ ప్రాంత ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్నారు.