Pawan Kalyan: సైబరాబాద్ తరహాలో అమరావతిని చంద్రబాబు నిర్మిస్తారు

అమరావతి ఆంధ్రుల రాజధాని గా అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటుందని హామీ ఇస్తున్నానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు

Update: 2025-05-02 10:54 GMT

అమరావతి ఆంధ్రుల రాజధాని గా అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటుందని హామీ ఇస్తున్నానని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. అమరావతి రైతులు గత ఐదేళ్ల పోరాటం చేశారన్నారు. అలుపెరగని పోరాటంలో ఎన్నో దెబ్బలు తిన్నారని పవన్ కల్యాణ్ అన్నారు. గత ప్రభుత్వం అమరావతి పనులను చేయకుండా అభివృద్ధిని అణగదొక్కిందని పవన్ కల్యాణ్ అన్నారు. అమరావతి రైతులు పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నారన్నారన్నారు.

శాశ్వత రాజధానిగా ...
చంద్రబాబు సైబరాబాద్ సిటీని ఎలా రూపకల్పన చేశారో? ఆయన అనుభవంతో దక్షతతో అమరావతిని కూడా అద్భుతమైన నగరాన్ని నిర్మిస్తారని తాను ఆకాంక్షిస్తున్నానని పవన్ కల్యాణ్ అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి సభకు వచ్చారని పవన్ కల్యాణ్ అన్నారు. ధర్మయుద్ధంలో చివరకు గెలుపు అమరావతి రైతులదేనని పవన్ కల్యాణ్ అన్నారు. అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని మాట ఇస్తున్నట్లు సభలో పవన్ కల్యాణ్ ప్రకటించారు.


Tags:    

Similar News