Pawan Kalyan : హిందీ భాషపై పవన్ కల్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు
హిందీ భాషపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు
హిందీ భాషపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. హిందీ భాష నేర్చుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. తెలుగు భాష అమ్మ అయితే హిందీ భాష పెద్దమ్మ అని పవన్ కల్యాణ్ అన్నారు. ఒక భాషను వ్యతిరేకించడం సరికాదని పవన్ కల్యాణ్ అన్నారు. హిందీ రాష్ట్ర భాష అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్న పవన్ కల్యాణ్ దానిని నేర్చుకుంటే ప్రయోజనమే తప్ప నష్టమేదీ ఉండదని అన్నారు.
ప్రతి ఒక్కరూ...
అనేక హిందీ సినిమాలు వివిధ భాషాల్లో డబ్ అవుతున్నాయని, వ్యాపారం కోసం హిందీ కావాలి కానీ, దేశ ప్రయోజనం కోసం ఆ భాష అనవసరం అంటే ఎలా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. అందుకే హిందీభాషను ప్రతిఒక్కరూ నేర్చుకోవాలని అన్నారు. ఇంగ్లీష్ భాష ఎందుకు నేర్చుకుంటామని తెలిసన వారికి హిందీ భాష ప్రయోజనం తెలియదా? అని అన్నారు. హిందీని వ్యతిరేకించడం అవివేకమని అన్నారు.