Pawan Kalyan : గిరిజన గ్రామాలకు పవన్ కల్యాణ్ రగ్గుల పంపిణీ
గిరిజన గ్రామాల ప్రజల కష్ట నష్టాలను తెలుసుకుని ఎప్పటికప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తున్నారు
గిరిజన గ్రామాల ప్రజల కష్ట నష్టాలను తెలుసుకుని ఎప్పటికప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తున్నారు. గతంలో అందరికీ మామిడిపండ్లు పంపించారు. అంతకు ముందు గిరిజన గ్రామాల్లోని ప్రజలకు చెప్పుులు పంపారు. తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిజన గ్రామాల్లోని ప్రజలకు రగ్గులు పంపించారు.
ఆరు గిరిజన గ్రామాలకు ...
మన్యం జిల్లాలోని ఆరు గిరిజన గ్రామాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రగ్గులు పంపారు. మొత్తం ఆరు గ్రామాల్లోని 222 కుటుంబాలకు మూడేసి రగ్గుల చొప్పున మొత్తం 666 రగ్గులను అధికారులు పంపిణీ చేశారు. వర్షాకాలం రావడంతో పాటు చలికాలంలోనూ ఇవి ఉపయోగపడతాయని భావించి వాటిని పంపిణీ చేయించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ పట్ల గిరిజనులు సంతోషం వ్యక్తం చేశారు.