vijayawada : ఇంద్రకీలాద్రిపై అంతరాలయ దర్శనం రద్దు
దసరా వేడుకల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ వారి అంతరాలయ దర్శనాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు
దసరా వేడుకల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ వారి అంతరాలయ దర్శనాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. భక్తులు అధిక సంఖ్యలో దుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు ఏటా విజయవాడకు వస్తుంటారు. అయితే ఐదు వందల రూపాయల టిక్కెట్ తో గతంలో అంతరాలయం దర్శనానికి అనుమతించేవారు. అయితే రద్దీతో సామాన్య భక్తులు ఇబ్బందులు పడే వారు.
దసరా వేడుకలకు...
దీంతో ఈ ఏడాది అంతరాలయం దర్శనం రద్దు చేయాలని దాదాపుగా నిర్ణయించారని తెలిసింది. ముఖమండపం వరకూ మాత్రమే దర్శనం ఉంటుంది. దసరా సమయంలో అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారని భావిస్తున్నారు. వివిధ రూపాల్లో ఉనన అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది ప్రజలు వస్తుండటంతో పాటు పది నుంచి పదిహేను లక్షల మంది వరకూ వస్తారని అంచనా వేసి ఈ నిర్ణయం తీసుకున్నారు.