కమల్ హాసన్ కు మించిన నటుడు బాలినేని

దర్శి వైసీపీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డిపై మండి పడ్డారు

Update: 2025-03-16 04:48 GMT

దర్శి వైసీపీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డిపై మండి పడ్డారు. జనసేన ప్లినరీలో వైసీపీ గురించి తమ పార్టీ అధ్యక్షుడు జగన్ పై మాజీ మంత్రి బాలినేని మాట్లాడటాన్ని ఖండిస్తున్నానని తెలిపారు. పార్టీ మారాలని నిర్ణయించుకున్నప్పుడు టీడీపీలో చేరాలని శతవిదాల ప్రయత్నించావని, అక్కడ రిజక్ట్ చేయడంతో జనసేనలో చేరావని అన్నారు. స్వార్దపూరిత రాజకీయ లబ్ధికోసమే జనసేలో చేరావంటూ ధ్వజమెత్తారు.జనసేనను ఉద్దరించేందుకు జనసేనలో చేరలేదని, అందుకు పవన్ కళ్యాణ్ తో సినామా తీయాలనుకుంటున్నాను అనే నీ వ్యాఖ్యలే నిదర్శనమని బూచేపల్లి శివప్రసాదరెడ్డి వ్యాఖ్యానించారు.

వచ్చే ఎన్నికల్లో...
బాలినేని కమల్ హాసన్ ను మించిన పెద్ద యాక్టర్ అంటూ ఎద్దేవా చేశారు. ఆయనను మించిన యాక్టర్ ఇంకోకరు ఉండరని, పవణ్ కళ్యాతో కాదు ముందు బాలినేనితో పినామా తీయాలనీ పవణ్ కళ్యాణ్ ను కోరుతున్నానని సెటైర్ వేశారు. వైఎస్ఆర్ చనిపోయింది 2009లో వైసీపీ పార్టీ పెట్టింది 2011లోనని, పార్టీ పెట్టిన నాటినుండి 2019వరకు ఇన్ని సంవత్సరాలు ప్రజల్లో ఉండి రాజశేఖర్ రెడ్డి ఆశయాలకోసం పనిచేస్తూ కార్యకర్తలకు అండగా నిలిచి రెక్కల కష్టార్జితంతో ముఖ్యమంత్రిగా జగన్ అయ్యారని గుర్తుంచుకోవాలన్నారు. మళ్లీ జగన్ ముఖ్యమంత్రి కాలేరని బాలినేని అంటున్నారని, బాలినేని ఒకటి గుర్తు పెట్టుకోవాలని, మీతాతలు ముత్తాతలు దిగి వచ్చిన 2029 ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి కావడాన్ని అడ్డుకోలంటూ సవాల్ విసిరారు


Tags:    

Similar News