తీరం దాటిన వాయుగుండం.. ఎఫెక్ట్ ఎంతంటే?
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం దక్షిణ ఒడిశా సమీపంలో తీరం దాటింది
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం దక్షిణ ఒడిశా సమీపంలో తీరం దాటింది. దక్షిణ ఒడిశా - గోపాల్ పూర్ సమీపంలో తీరం దాటింది. ఇది పశ్చిమ దిశగా కదిలి ఛత్తీస్ గఢ్ వైపు కదులుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండం నెమ్మదిగా బలహీన పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పాటు తెలంగాణ ఉత్తర కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర వరకూ ద్రోణి కొనసాగుతంుది.
రెండు రాష్ట్రాల్లో...
ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. బలమైన ఈదురుగాలులు వీస్తాయని, గంటకు యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది. రెండు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరింది.