తుపాను ఎఫెక్ట్.. విమానాలు రద్దు
మొంథా తుపాను దృష్ట్యా పలు విమానాలు రద్దుయ్యాయి.
మొంథా తుపాను దృష్ట్యా పలు విమానాలు రద్దుయ్యాయి. ఎయిర్ ఇండియాకి చెందిన విమానాలు రద్దు చేస్తున్నట్లు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ప్రకటించింది. విజయవాడ, విశాఖపట్నం కు వెళ్లే పలు విమానాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొంథా తుపాను తీవ్రత ఎక్కువగా ఉంటుందని భావించి ముందు జాగ్రత్త చర్యగా పలు విమానాలను రద్దు చేశారు.
వాతావరణం అనుకూలించదని...
ఎయిర్ పోర్టుల్లో ల్యాండ్ అయ్యేందుకు కూడా అవసరమైన వాతావరణం ఉండదని భావించి ముందుగానే విమాన సర్వీసులను రద్దు చేశారు. ముందుగా టిక్కెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఆ యా విమానయాన సంస్థలు ఈ విషయాన్ని తెలిపాయి. పరిస్థితి తీవ్రతను బట్టి ఎప్పటి నుంచి తిరిగి ప్రారంభమయ్యేది చెబుతామని వెల్లడించాయి.