నేటి నుంచి ఏపీలో నైట్ కర్ఫ్యూ

ఏపీ లో నేటి రాత్రి నుంచి కర్ఫ్యూ అమలులోకి రానుంది. నైట్ కర్ఫ్యూ నేటి నుంచి ఏపీలో కట్టుదిట్టంగా అమలు చేస్తారు.

Update: 2022-01-18 02:58 GMT

ఆంధ్రప్రదేశ్ లో నేటి రాత్రి నుంచి కర్ఫ్యూ అమలులోకి రానుంది. నైట్ కర‌్ఫ్యూను నేటి నుంచి ఏపీలో కట్టుదిట్టంగా అమలు చేస్తారు. కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకూ నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఇక మాస్క్ ధరించకపోతే ఖచ్చితంగా వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

నిబంధనలు పాటించకుంటే?
ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటించాలని, పాటించకపోతే చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.. శుభకార్యాలలకు ఇండోర్ లో అయితే వంద మందికి, బహిరంగ ప్రదేశాల్లో రెండు వందల మందికిమాత్రమే అనుమతిస్తారు. సినిమా హాళ్లలో యాభై శాతం ఆక్యుపెన్సీ తోనే అనుమతులు మంజూరు చేశారు. ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలను పాటించాలని, లేకుంటే కోవిడ్ కేసులు మరింత పెరుగుతాయన్న ఆందోళన వ్యక్తమవుతుంది.


Tags:    

Similar News