తిరుమలలో పెరిగిన రద్దీ.. దర్శనానికి ?

సోమవారం (మే22) స్వామివారిని 78,349 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నట్లు టీటీడీ వెల్లడించింది.

Update: 2023-05-23 03:46 GMT

may 23rd tirumala updates

రెండురోజులుగా తిరుమలలో భక్తుల రద్దీ కాస్త తక్కువగా ఉంది. ఆది, సోమవారాల్లో భక్తుల రద్దీ తగ్గడంతో.. క్యూలైన్లో ఉన్న భక్తులకు స్వామివారి దర్శనం త్వరగానే జరిగింది. నేడు (మే23) తిరుమలలో భక్తుల రద్దీ కాస్త పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం 15 కంపార్టుమెంట్లలో భక్తులు వెేచి ఉన్నారు. వీరంతా స్వామివారిని దర్శించుకునేందుకు 10 గంటల సమయం పడుతోంది.

సోమవారం (మే22) స్వామివారిని 78,349 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నట్లు టీటీడీ వెల్లడించింది. 39,634 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే సోమవారం శ్రీవారి హుండీకి రూ.4.56 కోట్ల ఆదాయం వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.


Tags:    

Similar News