ఈరోజు రద్దీ సాధారణమే కాని.. రేపు మాత్రం?

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. రేపు, ఎల్లుండి సర్వదర్శనాలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది

Update: 2023-10-13 03:38 GMT

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. రేపు, ఎల్లుండి సర్వదర్శనాలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేయడంతో ఈరోజు పెద్దగా భక్తులు తిరుమలకు రాలేదు. బ్రహ్మోత్సవాల సందర్భంగా రేపు, ఎల్లుండి సర్వదర్శనాలను టీటీడీ రద్దు చేసింది. పదిహేనో తేదీ నుంచి తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. గరుడ సేవ రోజున ఎలాంటి ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

ఆదాయం...
కాగా ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 22 కంపార్ట్‌మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు ఈరోజు స్వామి వారి దర్శనం ఆరు గంటల్లో పూర్తవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 65,937 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,101 మంది తలనీలాలను సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.28 కోట్లు వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News