Tirumala : వేచి ఉండకుండానే నేరుగా స్వామి వారి దర్శనం

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. స్వామి వారి దర్శనం కోసం కంపార్ట్‌మెంట్లలో వేచి చూడకుండా నేరుగా వెళ్లే అవకాశముంది

Update: 2024-01-10 02:54 GMT

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. సక్రాంతి పండగ దగ్గరపడుతుండటం, పరీక్షలు కూడా ముంచుకు వస్తుండటంతో భక్తులు పెద్దగా తిరుమలకు చేరుకోవడం లేదు. దీంతో క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ ఖాళీగానే ఉన్నాయి. స్వామి వారి దర్శనం కోసం కంపార్ట్‌మెంట్లలో వేచి చూడకుండా నేరుగా వెళ్లే అవకాశముంది. దీంతో భక్తులు ఎక్కువ సేపు స్వామి వారి దర్శనంకోసం వేచి చూడటం లేదు. వసతి గృహాలకు కూడా పెద్దగా డిమాండ్ లేదని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు.

ఆరు గంటల్లో...
నిన్న తిరుమల శ్రీవారిని 65,901 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 16,991 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.77 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. ఈరోజు సర్వదర్శనం క్యూ లైన్ లో టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు స్వామి వారి దర్శనం ఆరు గంటల్లో పూర్తవుతుందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News