Tirumala : తిరుమలలో నేరుగా స్వామి వారి దర్శనం

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. సంక్రాంతి పండగ కావడంతో భక్తులు సొంత గ్రామాలకు వెళ్లడంతో తిరుమలకు భక్తులు రావడం లేదు

Update: 2024-01-14 03:11 GMT

arjita seva tickets, devotees, online, tirumala

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. సంక్రాంతి పండగ కావడంతో భక్తులు సొంత గ్రామాలకు వెళ్లడంతో తిరుమలకు భక్తులు పెద్దగా రావడం లేదు. దీంతో క్యూ లైన్లన్నీ ఖాళీగానే కనిపిస్తున్నాయి. స్వామి వారి దర్శనం కూడా భక్తులకు సులువుగా మారింది. పెద్దగా వెయిట్ చేయకుండానే భక్తులు శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

తగ్గిన భక్తుల రద్దీ...
ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులు నేరుగా స్వామి వారి దర్శనం చేసుకుంటున్నారు. కంపార్ట్‌‌మెంట్‌లోని భక్తులు ఎవరూ వేచి చూడటం లేదు. సర్వదర్శనం క్యూ లైన్ లో టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు శ్రీవారి ధర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 65,962 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,575 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.78 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.


Tags:    

Similar News