Tirumala : తిరుమలకు ఈరోజు వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అరగంటలోనే దర్శనం

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శరన్నవరాత్రులు ప్రారంభం కావడంతో భక్తుల రద్దీ నేడు అంతగా లేదు

Update: 2025-09-22 02:58 GMT

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శరన్నవరాత్రులు ప్రారంభం కావడంతో భక్తుల రద్దీ నేడు అంతగా లేదు. అందులో సోమవారం కావడంతో భక్తులు స్వల్ప సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. ఇటీవల కాలంలో తిరుమలకు అత్యంత తక్కువ సంఖ్యలో భక్తులు రావడం ఈరోజు మాత్రమేనని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. అయితే మళ్లీ రేపటి నుంచి భక్తుల రాక ప్రారంభమయ్యే అవకాశముందని టీటీడీ అంచనా వేస్తుంది. అందుకు అనుగుణంగా అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తుంది.

రెండు రోజుల్లో...
తిరుమలకు భక్తులు రానున్న రోజుల్లో అధిక సంఖ్యలో వస్తారని అంచనా వేసింది. తమిళనాడులోనూ పెరటాసి మాసం ప్రారంభం కానుండటంతో తమిళనాడుకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. అలాగే ఈ నెలలో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సాలు జరగనుండటంతో ఇక తిరుమలకు భక్తులు పోటెత్తనున్నారు. స్వామి వారి వాహన సేవలను చూసేందుకు తిరుమలకు చేరుకుంటారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. భక్తులు బ్రహ్మోత్సవాల సందర్భంగా వసతి గృహాల కోసం ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
ఒక కంపార్ట్ మెంట్ లోనే...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కేవలం ఒక కంపార్ట్ మెంట్ లోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం కేవలం ఐదు గంటల సమయం మాత్రమే పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు కేవలం రెండు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలుచేసిన భక్తులకు శ్రీవారి దర్శనం గంటలోపే పూర్తవుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 67,408 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో : 16,597 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.73 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.









Tags:    

Similar News