వీకెండ్‌లో రద్దీ తక్కువ... ఎందుకంటే?

వీకెండ్ లో తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రతి భక్తుడు శనివారం స్వామి వారిని దర్శించుకోవాలనుకుంటారు.

Update: 2023-09-17 03:35 GMT

వీకెండ్ లో తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ప్రతి భక్తుడు శనివారం స్వామి వారిని దర్శించుకోవాలనుకుంటారు. కానీ శనివారం వస్తే ఇబ్బంది పడాల్సి వస్తుందని భావించి మిగిలిన రోజుల్లో భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. అందుకే నిన్న భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఈరోజు కూడా భక్తుల రద్దీ అంతగా లేదు. నిన్న తిరుమల శ్రీవారిని 66,590 మంది భక్తులు మాత్రమే దర్శించుకున్నారు. 31,052 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

వినాయక చవితి...
నిన్న తిరుమల శ్రీవారి హుండా ఆదాయం 3.37 కోట్ల రూపాయలు వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఈరోజు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని తొమ్మిది కంపార్ట్‌మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వీరికి దర్శన సమయం పది గంటల మాత్రమే సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. వీకెండ్ లో అధిక సంఖ్యలో భక్తులు వస్తారని భావించడంతో పాటు, సోమవారం వినాయక చవితి కావడంతో తిరుమలలో రద్దీ పెద్దగా లేదు. రేపటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
రేపటి నుంచి ...
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. తొమ్మిదిరోజుల పాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా వీఐపీ దర్శనాలు, ఆర్జిిత సేవలు, ప్రత్యేక దర్శనాలు టీటీడీ రద్దు చేసింది. కేవలం మూడు వందల రూపాయల ప్రత్యేక టిక్కెట్లు పొందిన వారిని మాత్రమే అనుమతించనుంది. సర్వదర్శనంలో ఎటూ భక్తులు వెళ్లవచ్చు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుందని భావించి టీటీడీ ఆరు లక్షల లడ్డూలను తయారు చేయాలని నిర్ణయించింది. ముందు వచ్చిన వారికి మాత్రమే గదులు కేటాయింపు విధానాన్ని అనుసరిస్తుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. 24 గంటల పాటు ఘాట్‌‌రోడ్ లో వాహనాలకు అనుమతి ఇవ్వనున్నారు.


Tags:    

Similar News