Tirumala : తిరుమలలో రద్దీ అంతంత మాత్రమే

తిరుమలలో రద్దీ సాధారణంగానే ఉంది. భక్తుల రద్దీ తక్కువగా ఉండటంతో సులువుగా స్వామి వారి దర్శనం లభిస్తుంది.

Update: 2024-02-07 01:58 GMT

arjita seva tickets, devotees, online, tirumala

Tirumala darshan update: తిరుమలలో రద్దీ సాధారణంగానే ఉంది. భక్తుల రద్దీ తక్కువగా ఉండటంతో సులువుగా స్వామి వారి దర్శనం లభిస్తుంది. మంగళవారం నుంచి తిరుమలకు భక్తుల రద్దీ తగ్గింది. ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండటంతో తిరుమలకు వచ్చే వారి సంఖ్య తక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో ముందుగా టిక్కెట్ బుక్ చేసుకున్న వారు మాత్రమే వస్తున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు స్వామి వారి దర్శనం రెండు గంటల సమయం పడుతుంది.

ఆదాయం ...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని నాలుగు కంపార్ట్‌మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు స్వామి వారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 64,345 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 20,788 మంది భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయయం 3.71 కోట్ల రూపాయలు వచ్చింది.


Tags:    

Similar News