Tirumala : తిరుమలకు నేడు వెళ్లేవారికి గుడ్ న్యూస్..వెంటనే దర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శుక్రవారం అయినా భక్తుల రద్దీ పెద్దగా లేదు.
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శుక్రవారం అయినా భక్తుల రద్దీ పెద్దగా లేదు. గత రెండు రోజుల నుంచి తిరుమలకు భక్తుల రద్దీ తగ్గింది. గతంలో మాదిరిగా పెద్దగా స్వామి దర్శనానికి వేచి ఉండకుండానే పూర్తవుతుండటంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలలో వసతి గృహాల కొరత కూడా పెద్దగా లేకపోవడంతో భక్తులు నింపాదిగా తిరుమలలో ఆధ్మాత్మిక చింతనలో గడుపుతున్నారు. తిరుమలకు వచ్చే వారి భక్తుల సంఖ్య వచ్చే కాలంలో మరింత పెరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఫిబ్రవరి నెలకు....
తిరుమలను వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో దర్శించుకునే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. ఈరోజు ఆన్ లైన్ లో ఫిబ్రవరి నెలకు సంబంధించిన దర్శన టిక్కెట్లను విడుదల చేయనుంది. ఉదయం పది గంటలకు ఆర్జిత సేవా టిక్కెట్లను కూడా టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. అలాగే మధ్యాహ్నం మూడు గంటలకు వర్చువల్ సేవా టిక్కెట్లను విడుదల చేయనుంది. తిరుమలకు వచ్చే భక్తులు టీటీడీ అధికార వెబ్ సైట్ నుంచే ఆన్ లైన్ లో బుక్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కోరుతున్నారు.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని తొమ్మిది కంపార్ట్ మెంట్లలోనే భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు మూడు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల్లోనే పూర్తవుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 66,839 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 19,220 మంది భక్తులు తమ తలనీలలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.61 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.