పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు.. ఎందుకంటే?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పై క్రిమినల్ కేసు నమోదైంది. ఇది నమోదైంది తమిళనాడులో!!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ పై క్రిమినల్ కేసు నమోదైంది. ఇది నమోదైంది తమిళనాడులో!! మధురైలో ఇటీవల నిర్వహించిన ఆధ్యాత్మిక సభలో కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో ఈ కేసును నమోదు చేశారు. పవన్‌తో పాటు తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై, హిందూ మున్నాని నాయకులపై కూడా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మదురైలో జరిగిన మురుగన్ భక్తుల సదస్సులో నిబంధనలు ఉల్లంఘించారని పవన్ పైన ఆరోపణలు వచ్చాయి. అన్నానగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అడ్వకేట్ వాంజినాతన్ ఫిర్యాదు మేరకు పోలీసులు పవన్ తో పాటుగా ఈ సభ నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.