Chandrababu : చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు సీఆర్డీఏ సమావేశం జరగనుంది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు సీఆర్డీఏ సమావేశం జరగనుంది. సీఆర్డీఏ అధారిటీ సమావేశలో పలు కీలక నిర్ణయాలను తీసుకోనున్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు ఉదయం 11.15 గంటలకు సచివాలయానికి రానున్నారు. ఉదయం 11.30 గంటలకు కొల్లేరు సమస్యలపై సమీక్ష చేస్తారు.
వివిధ శాఖలపై సమీక్ష...
అనంతరం 12.30 గంటలకు చంద్రబాబు నాయుడు సీఆర్డీఏపై సమీక్ష నిర్వహించనున్నారు. అమరావతి రాజధాని నిర్మాణ పనుల్లో వేగం పెంచడంతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశముంది. మధ్యాహ్నం మూడు గంటలకు గంటలకు వివిధ పథకాల అమలు తీరు, ఆర్టీజీఎస్ పై సమీక్షను చంద్రబాబు చేస్తారు. సాయంత్రం 6.15 గంటలకు ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.