Jogi Ramesh : జోగి రమేష్ కు రిమాండ్
నకిలీ మద్యం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి జోగి రమేష్ కు న్యాయస్థానం రిమాండ్ విధించింది
నకిలీ మద్యం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి జోగి రమేష్ కు న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఆయన సోదరుడు జోగి రాము కు కూడా రిమాండ్ విధించింది. ఈ నెల 13వ తేదీ వరకూ రిమాండ్ విధించింది. ఈరోజు తెల్లవారు జామున విజయవాడ సబ్ జైలుకు అధికారులు ఇద్దరినీ తరలించారు. నిన్న నకిలీ మద్యం కేసులో ఇద్దరినీ అదుపులోకి తసీుకుని విచారించిన అనంతరం నేడు న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టారు.
నకిలీ మద్యం కేసులో...
మాజీ మంత్రి జోగి రమేష్ కు మద్దతుగా కుటుంబ సభ్యులతో పాటు వైసీపీ నేతలు, కార్యకర్తలు విజయవాడ సబ్ జైలు కు భారీగా చేరుకున్నారు.కుటుంబ సభ్యులలను చూసి మాజీ మంత్రి జోగి రమేష్, సోదరుడు జోగి రాము భావోద్వేగానికి గురయ్యారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే జోగి అరెస్ట్ అంటూ వైసీపీ నేతల ఆందోళనకు దిగారు.