రేపు గుంటూరు పోలీస్ కస్టడీకి గోరంట్ల మాధవ్

హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది

Update: 2025-04-22 01:47 GMT

హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ను పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. రేపు, ఎల్లుండి గోరంట్ల మాధవ్ ను విచారించేందుకు గుంటూరు కోర్టు ఓకే చెప్పింది. దీంతో రాజమండ్రి జైలులో ఉన్న గోరంట్ల మాధవ్ ను రేపు అదుపులోకి తీసుకుని ప్రశ్నించనున్నారు. ఐదు రోజుల కస్టడీకి పోలీసులు అనుమతి కోరగా, రెండు రోజులు మాత్రమే అనుమతి ఇచ్చింది. మాజీ సీఎం జగన్ సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ ను అరెస్ట్ చేసిన సమయంలో మాధవ్ పోలీసుల విధులకు ఆటంక పర్చడమే కాకుండా నిందితుడిని తనకు అప్పగించాలంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.

రాజమండ్రి జైలులో ఉన్న...
దీంతో అరెస్ట్ చేసిన పోలీసులు గోరంట్ల మాధవ్ ను న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా పథ్నాలుగు రోజులు రిమాండ్ విధించింది. ప్రస్తుతం గోరంట్ల మాధవ్ రాజమండ్రి జైలులో ఉన్నారు. గోరంట్ల మాధవ్ సెల్ ఫోన్ లో మాట్లాడటం కూడా వివాదమయింది. ఈ ఘటనలో పదకొండు మంది పోలీసులను సస్పెండ్ చేశారు. వీటన్నింటిపై గుంటూరు పోలీసులు ప్రశ్నించే అవకాశముంది.


Tags:    

Similar News