కర్నూలు మెడికల్ కళాశాలలో కరోనా.. 15 మందికి
కర్నూలు జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కరోనా కలకలం రేగింది.
కర్నూలు జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కరోనా కలకలం రేగింది. ఇక్కడ అధిక శాతం మంది కరోనా బారిన పడటంతో వైద్యులు, సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. కర్నూలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో విద్యార్థులకు స్వల్ప లక్షణాలు కనపడటంతో వైద్య పరీక్షలు నిర్వహించారు,
మిగిలిన వారికి....
యాభై మంది మెడికల్ స్టూడెంట్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 11 మంది వైద్య విద్యార్థులో పాటు నలుగురు హౌస్ సర్జన్లు కరోనా బారిన పడ్డారు. ఈ ఆసుపత్రిలోనే వారికి చికిత్స అందిస్తున్నారు. మరో నలభై మంది పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది.