అనంతపురం మెడికల్ కళాశాలలో కరోనా కలకలం

అనంతపురం మెడికల్ కళాశాలలో కరోనా కలకలం రేగింది. ఈ మెడికల్ కళాశాలలో ఎక్కువ మంది కరోనా బారిన పడినట్లు చెబుతున్నారు.

Update: 2022-01-28 02:54 GMT

అనంతపురం మెడికల్ కళాశాలలో కరోనా కలకలం రేగింది. ఈ మెడికల్ కళాశాలలో ఎక్కువ మంది కరోనా బారిన పడినట్లు చెబుతున్నారు. మెడికల్ కళాశాలలోని వైరాలజీ ల్యాబ్ లోని ఎనిమిది మంది సిబ్బందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో కళాశాల యాజమాన్యం అప్రమత్తమయింది. అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.

జిల్లాలోనే ఎక్కువగా.....
అనంతపురం జిల్లాలో కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. నిన్న ఒక్కరోజే 980 కరోనా కేసులు నమోదయ్యాయి. దాదాపు పదివేల యాక్టివ్ కేసులు జిల్లాలో ఉన్నాయి. మెడికల్ కళాశాలలోనూ కరోనా వ్యాప్తి జరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కోవిడ్ నిబంధనలను మరింత కఠినతరం చేయాలని నిర్ణయించారు.


Tags:    

Similar News