తిరుపతి ఐఐటీ లో కరోనా కలకలం..70 మందికి?

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రధానంగా విద్యాసంస్థల్లో ఎక్కువమంది కరోనా బారిన పడుతున్నారు.

Update: 2022-01-23 04:07 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రధానంగా విద్యాసంస్థల్లో ఎక్కువమంది కరోనా బారిన పడుతున్నారు. తాజాగా తిరుపతి ఐఐటీ క్యాంపస్ లో 70 మంది కరోనా బారిన పడ్డారు. వీరికి జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఐఐటీ క్యాంపస్ నిర్వాహకులు అప్రమత్తమయ్యారు. వీరిలో నలభై మంది విద్యార్థులు, ముప్ఫయి మంది సిబ్బంది ఉన్నారు.

సంక్రాంతి సెలవులకు....
ఇటీవల సంక్రాంతి సెలవులకు విద్యార్థులు తమ సొంత గ్రామాలకు వెళ్లి వచ్చారు. అప్పటి నుంచి కొంత అస్వస్థతకు గురి కావడంతో 214 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 70 మందికి కరోనా సోకింది. వీరందరిని ఐసొలేషన్ లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు.


Tags:    

Similar News