ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో రామ్ గోపాల్ వర్మ
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒంగోలు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒంగోలు పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆయనను ప్రస్తుతం ఒంగోలు సీఐ ప్రశ్నిస్తున్నారు. వ్యూహం సినిమా విడుదలకు ముందు ప్రమోషన్లలో భాగంగా చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ పై అనుచిత పోస్టింగ్ లు పెట్టినందుకు రామ్ గోపాల్ వర్మ పై మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయిన సంగతి తెలిసిందే.
వెల్లంపల్లి వద్ద...
అయితే గతంలో అనేక సార్లు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాని వర్మ నేడు పోలీసుల విచారణకు హాజరయ్యారు. హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందారు. అయితే రోడ్డు మార్గాన వచ్చిన రామ్ గోపాల్ వర్మ మద్దిపాడు సమీపంలోని వెల్లంపల్లి వద్ద ఉన్న ఒక హోటల్ వద్ద ఆగారు. అక్కడ వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భేటీ అయ్యారు. ఇద్దరూ కాసేు మాట్లాడుకున్న అనంతరం రామ్ గోపాల్ వర్మ ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరు అయ్యారు.