నేడు బెజవాడలో కాంగ్రెస్ నిరసన
చంద్రబాబు ప్రభుత్వం విధానాలకు నిరసనగా నేడు కాంగ్రెస్ విజయవాడలో నిరసనలు తెలుపుతుంది
చంద్రబాబు ప్రభుత్వం విధానాలకు నిరసనగా నేడు కాంగ్రెస్ విజయవాడలో నిరసనలు తెలుపుతుంది. విజయవాడలో జరిగే ఈ కార్యక్రమానికి పెద్దయెత్తున కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు హాజరు కావాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పిలుపు నిచ్చారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇంకా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆరోపిస్తూ ఈ నిరసన తెలియజేయాలని నిర్ణయించింది.
చంద్రబాబు ప్రభుత్వానికి నిరసనగా...
ఈ మేరకు వైఎస్ షర్మిల కాంగ్రెస్ శ్రేణులకు నిరసనలకు పిలుపు నిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా నేటికి తమ ఎన్నికల హామీలు అమలు చేయలేదని, రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా, ప్రజలకు ఇచ్చిసూపర్ సిక్స్ హామీని అమలు చేయమని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు విజయవాడ ధర్నా చౌక్ నందు "థాలీ బజావో" పేరిట నిరసన కార్యక్రమం జరపనుంది. ఈ కార్యక్రమానికి ఏపీసీసీ అధ్యక్షులు వై.ఎస్. షర్మిల పాల్గొంటారు.