గండికోటను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం: సీఎం జగన్‌

వైఎస్‌ఆర్‌ కడప జిల్లా గండికోటలో ఒబరాయ్‌ హోటల్‌ నిర్మాణ పనులకు సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేశారు. త్వరలోనే గండికోట, తిరుపతి,

Update: 2023-07-09 10:58 GMT

గండికోటను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం: సీఎం జగన్‌

వైఎస్‌ఆర్‌ కడప జిల్లా గండికోటలో ఒబరాయ్‌ హోటల్‌ నిర్మాణ పనులకు సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేశారు. త్వరలోనే గండికోట, తిరుపతి, వైజాగ్‌లో ఒబరాయ్‌ గ్రూపు హోటల్స్‌ రానున్నాయి. గండికోటలో భూమిపూజ చేసిన సీఎం జగన్‌.. విశాఖ, తిరుపతి ఒబెరాయ్‌ హోటల్స్‌కు వర్చువల్‌గా శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. జమ్ములమడుగు నియోజకవర్గంలో మరో మంచి కార్యక్రమానికి నాంది పలికామన్నారు. కడప జిల్లా జమ్ములమడుగు నియోజకవర్గంలోనే కాకుండా విశాఖపట్నం, తిరుపతితో కలిపి 3 చోట్ల కూడా శంకుస్ధాపన కార్యక్రమాలు జరిగాయన్నారు. ముఖ్యంగా గండికోటలో జరిగిన ఈ కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకమైనదని గ్రాండ్‌ కాన్యన్‌ ఆఫ్‌ ఇండియాగా పిల్చుకునే గండికోటను ప్రపంచానికి పరిచయం చేస్తున్నామని సీఎం అన్నారు.

ఇవాళ ఒబరాయ్‌ లాంటి గ్రూపు ఇక్కడకి వచ్చి, సూపర్‌ లగ్జరీ సెవన్‌ స్టార్‌ హోటల్‌ నిర్మాణం చేపడుతోందని, ఇలాంటి పెద్ద పెద్ద గ్రూపులు వచ్చి ఇలాంటి హోటల్స్‌ కడితే.. గండికోటని గ్లోబల్‌ టూరిజం మ్యాప్‌లోకి తీసుకొనిపోగలుగుతామన్నారు. ఇటు గండికోటతో పాటు అటు తిరుపతి, విశాఖపట్నంలో కూడా ఇలాంటి హోటల్స్‌ వస్తున్నాయని సీఎం జగన్‌ తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల కడప జిల్లా, గండికోట రెండూ వరల్డ్ మ్యాప్‌లలో చోటు దక్కించుకుంటున్నాయని అన్నారు. కడప జిల్లాలో గతంలో ఇదే జమ్మలమడుగు నియోజకవర్గంలో.. స్టీల్‌ ఫ్యాక్టరీ రావాలని కలులు కన్నామని, ఆ కలను నిజం చేస్తూ... గతేడాది జిందాల్‌ గ్రూపుతో కలిసి.. ఆ ప్రాజెక్టుకు శంకుస్ధాపన చేశామని సీఎం జగన్‌ గుర్తు చేశారు. ఆ ప్రాజెక్టుకు సంబంధించి.. వైయస్సార్‌ స్టీల్‌ కార్పొరేషన్‌కు ఈ జూలైలో ఎన్విరానిమెంటల్‌ క్లియరెన్స్‌ వస్తుందన్నారు.

ఇక్కడ ఒబరాయ్‌ హోటల్‌ రావడం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని సీఎం జగన్‌ తెలిపారు. ఈ హోటల్‌ వల్ల ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ దాదాపు 500 నుంచి 800 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. ఈ ఒబరాయ్‌ ప్రాజెక్టు అనేది ఇతర ప్రాజెక్టులు రావడానికి ఒక లంగరు వలె పని చేస్తుందన్నారు. గండికోటలో ఇలాంటి గ్రూపు ప్రాజెక్టులు రావడానికి ఇంకా అవకాశం ఉందన్న సీఎం జగన్‌.. కనీసం ఒబరాయ్‌ లాంటి ఇంకో గ్రూపుని ఇక్కడికి తీసుకొచ్చే కార్యక్రమం కూడా ముమ్మరంగా చేస్తామన్నారు.

రేపు కొప్పర్తిలో డిక్స్‌న్‌ కంపెనీకు సంబంధించి ప్రారంభోత్సవం చేస్తామని, కొప్పర్తిలో డిక్సన్‌ గ్రూపు 1000పైగా ఉద్యోగాలు ఇచ్చారని, మరో రెండు నెలల్లో ఇంకో 1000 ఉద్యోగాలు రాబోతున్నాయి సీఎం జగన్‌ తెలిపారు. ఛానల్‌ ప్లే అనే మరో కంపెనీ.. హోం ఆడియో సిస్టమ్స్‌ తయారు చేస్తుంది. రేపు కొప్పర్తిలో ఆ కంపెనీతో ఎంఓయూ పై సంతకాలు చేయనున్నామని, ఈ కంపెనీ ద్వారా 150 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని సీఎం జగన్‌ తెలిపారు. ఇక రెండోది ఎల్‌ఈడీ టీవీలు, ఎలక్ట్రానిక్‌ ప్రొడక్ట్స్‌ తయారు చేసే టెక్నో డామ్‌ ఇండియా అనే మరో కంపెనీతో కూడా రేపు ఎంఓయూ చేయబోతున్నామన్నారు. ఈ కంపెనీ ద్వారా మరో 200 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని సీఎం జగన్‌ తెలిపారు. 

Tags:    

Similar News