రేపు తిరుమలకు సీఎం జగన్

రేపు రాత్రికి తిరుమలలోనే బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం మరోసారి స్వామివారి దర్శనం చేసుకుని..

Update: 2022-09-26 11:50 GMT

రేపటి నుంచి (సెప్టెంబరు 27) తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం జగన్ మోహన్ రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 3.55 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి జగన్ తిరుపతికి బయల్దేరుతారు. సాయంత్రానికి తిరుపతికి చేరుకుంటారు. తొలుత సీఎం అలిపిరి వద్ద ఎలక్ట్రిక్ బస్సును ప్రారంభిస్తారు. అనంతరం తిరుమలకు చేరుకుంటారు.

రాత్రి 8.20 గంటలకు స్వామివారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించి, దర్శనం చేసుకుంటారు. రేపు రాత్రికి తిరుమలలోనే బస చేస్తారు. మరుసటి రోజు ఉదయం మరోసారి స్వామివారి దర్శనం చేసుకుని, ఇతర కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. తిరుమల కొండపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిర్మించిన నూతన పరకామణి భవనాన్ని సీఎం ప్రారంభిస్తారు. ఆ తర్వాత లక్ష్మీ వీపీఆర్ రెస్ట్ హౌస్ ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు. అనంతరం రేణిగుంట చేరుకుని నంద్యాల జిల్లా పర్యటనకు వెళ్తారు.



Tags:    

Similar News