అందని ద్రాక్షగా టమాటా.. సబ్సిడీ ఇస్తోన్న ప్రభుత్వం.. ఇప్పుడు కిలో?

టమాటా ధర ఆకాశాన్నంటడంతో.. ఏపీ ప్రభుత్వం రైతు బజార్లలో సబ్సిడీ కింద టమాటాలను అమ్మాలని నిర్ణయించింది.

Update: 2023-06-29 14:46 GMT

tomato sales in subsidy rates

టమాటా.. ఈ పేరు చెప్పగానే అందరికీ నోట్లో లాలాజలం ఊరుతుంది. టమాటాతో చేసే వంటకాలు అంతరుచిగా ఉంటాయి మరి. కానీ ఇప్పుడు టమాటా పేరు వింటే.. కళ్లంట నీళ్లొకటే తక్కువ అన్నట్లుగా ఉంది. డిమాండ్ కు తగిన సరఫరా లేకపోవడంతో.. టమాటాతో పాటు.. కూరగాయల ధరలన్నీ ఆకాశాన్నంటాయి. ఏం కొనాలన్నా.. వందల రూపాయలు వెచ్చించాల్సిందే. రెండురోజులకు సరిపడా కూరగాయలు నాలుగు రకాలు తీసుకోవాలంటే.. కనీసం రెండు మూడొందలైనా కావాల్సిందే. ప్రతికూరలో ఉల్లిపాయ ఎంత ముఖ్యమో.. టమాటా కూడా అంతే ముఖ్యం. దాని రుచి లేకపోతే ఏదో వెలితిగా ఉంటుంది.

ఇప్పుడు టమాటా అందని ద్రాక్షగా మారడంతో.. దానిని కొనాలంటేనే భయపడుతున్నారు. వందైనా లేనిదే కిలో టమాటా రానంటోంది. ఇది రైతు మార్కెట్లో ధర. ఇక బయటి మార్కెట్లలో అయితే.. అసలు నా వైపు చూడకపోవడమే మీ జేబుకి మంచిదన్నట్టుగా ఉంది దాని వరుస. టమాటా ధర ఆకాశాన్నంటడంతో.. ఏపీ ప్రభుత్వం రైతు బజార్లలో సబ్సిడీ కింద టమాటాలను అమ్మాలని నిర్ణయించింది. గతంలో ఉల్లిపాయల ధరలు పెరిగినప్పుడు కూడా ప్రభుత్వం ఇలాగే చేసింది. రేషన్ కార్డు ఉన్నవారందరికీ సబ్సిడీపై ఉల్లిపాయలను అందించింది. ఇప్పుడు టమాటా వంతు వచ్చింది. టమాటాలను రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి రైతుబజార్లలో కేజీ రూ.50కే అందుబాటులో ఉంచుతోంది. టమాటా ఒక్కటే ధరెక్కువగా ఉందా ? అంటే కాదు. కిలో మిర్చి ధర ఏకంగా రూ.120వరకూ ఉంది. మిగతా కూరగాయల ధరలు కూడా రూ.50 దాటేస్తున్నాయి. ప్రభుత్వం చొరవతో కనీసం టమాటా అయినా సబ్సిడీలో దొరుకుతుంది.





Tags:    

Similar News