నేడు 3 పథకాలకు సీఎం చంద్రబాబు శ్రీకారం
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ సీఎం చంద్రబాబునాయుడు చేనేత కార్మికులకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చే పథకానికి గురువారం శ్రీకారం చుడుతున్నారు.
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ సీఎం చంద్రబాబునాయుడు చేనేత కార్మికులకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చే పథకానికి గురువారం శ్రీకారం చుడుతున్నారు. చేనేత దుస్తులపైనా 5 శాతం జీఎస్టీ మినహాయింపు పథకాన్ని కూడా ప్రారంభిస్తున్నారు. చేనేతలకు రూ.5 మేర త్రిఫ్ట్ నిధులు మంజూరు చేస్తున్నారు. ఉచిత విద్యుత్ కోసం ఏడాదికి రూ.190 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చిస్తోంది. జీఎస్టీ మినహాయింపునకు ఏడాదికి రూ.15 కోట్లను నేతన్నలకు చెల్లించాలని నిర్ణయించింది. ఉచిత విద్యుత్ పథకంతో మగ్గాలపై నేసే నేతన్నలకు నెలకు1,233ల చొప్పున్న ఏడాదికి రూ.14,956లు, మర మగ్గాలపై ఆధారపడిన వారికి నెలకు రూ. 2,717ల చొప్పున్న 32,604ల మేర లబ్ధి కలగనుంది. చేనేత కుటుంబాలకు త్వరలో ఆరోగ్య బీమా పథకం వర్తింప జేయడానికి ప్రణాళికలు రూపొందించింది. త్వరలో చేనేత సహకార సంఘాల ఎన్నికలు కూడా నిర్వహించడానికి ఏర్పాట్లు చేపట్టింది.