TDP : తునిలో కొట్టుకున్న టీడీపీ క్యాడర్.. ఎందుకంటే?
కాకినాడ జిల్లాలో న్యూఇయర్ వేడుకల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది.
Clash broke out between telugu desam party workers
కాకినాడ జిల్లాలో న్యూఇయర్ వేడుకల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. తునిలో యనమల రాజేష్, యనమల కృష్ణుడు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. యనమల రామకృష్ణుడు, దివ్యలకు శుభాకాంక్షలు చెప్పేందుకు వెళ్తున్న రాజేష్ వర్గాన్ని కృష్ణుడు వర్గం అడ్డుకుంది. దీంతో రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి.
రెండు వర్గాల మధ్య....
రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. గత కొంతకాలంగా ఇరువర్గాల మధ్య విభేదాలు నెలకొన్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. తుని నియోజకవర్గం సీటు విషయంలోనే ఈ విభేదాలు తలెత్తాయని తెలిసింది. చాలా రోజుల నుంచి ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు ఈరోజు కొత్త ఏడాది సందర్భంగా ఘర్షణకు దారితీశాయి.