రాజధాని భూ కుంభకోణం కేసులో ఐదుగురి అరెస్ట్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అసైన్డ్ భూముల కుంభకోణం కేసులో సీఐడీ అధికారులు ఐదుగురిని అరెస్ట్ చేశారు

Update: 2022-09-13 11:56 GMT

ఆంధ్రప్రదేశ్ రాజధాని అసైన్డ్ భూముల కుంభకోణం కేసులో సీఐడీ అధికారులు ఐదుగురిని అరెస్ట్ చేశారు. కొల్లి శివరాం, గట్టెం వెంకటేష్, చిక్కాల విజయసారధి, బడే ఆంజనేయులు, కొట్టి దొరబాబులను సీఐడీ అరెస్ట్ చేసింది. 1100 అసైన్డ్ భూముల విషయంలో సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుల ప్రధాన నిందితుడిగా మాజీ మంత్రి నారాయణ ఉన్నారు. నారాయణ తన సొంత బంధువుల పేరుతో బినామీ లావాదేవీలను జరిపినట్లు సీఐడీ చెబుతోంది.

మాజీ మంత్రి నారాయణ...
మాజీ మంత్రి నారాయణ రాజధాని ప్రాంత గ్రామాల్లో 79.45 ఎకరాల అసైన్డ్ ంెంట్ భూములను కొనుగోలు చేశారని, ఇది అక్రమమని ఆరోపిస్తుంది. రామకృష్ణ హౌసింగ్ డెరెక్టర్ ఖాతాల ద్వారా భూములు కొన్న వారికి నగదు చెల్లింపులు జరిగాయని పేర్కొంి. రామకృష్ణ హౌసింగ్ సొసైటీ, మాజీ మంత్రి నారాయణ మధ్య 15 కోట్ల మేర ఆర్థిక లావాదేవీలు జరిగాయన్నది సీఐడీ ఆరోపణ. అనంతవరం, కృష్ణాయపాలెం, కూరగల్లు, లింగాయపాలెం, మందడం, నెక్కల్లు, నవులూరు, రాయపూడి, తుళ్లూరు, ఉద్దండరాయుని పాలెం, వెంకటపాలెం గ్రామాలలో మొత్తం 89.8 ఎకరాల భూమిని మాజీ మంత్రి నారాయణ అక్రమంగా కొనుగోలు చేశారన్నది ప్రధాన ఆరోపణ.


Tags:    

Similar News