సీఐ స్వర్ణలత స్టెప్పేస్తే.. వైరల్ అవుతున్న వీడియోలు

తనకు సినిమాలపై ఉన్న ఆసక్తితో.. స్వర్ణలత కొంతకాలం క్రితం ఓ తెలుగు పాటకు డ్యాన్స్ చేసింది. అది మరెవరి పాటో కాదు..

Update: 2023-07-08 06:54 GMT

CI Swarna Latha Dance video

సీఐ స్వర్ణలత.. ఇప్పుడీ పేరు తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు. ఈవిడ చేసిన నోట్ల మార్పిడి కేసు అంతటి సంచలనం రేపింది. రూ.2000 నోట్ల మార్పిడి వ్యవహారంలో భారీమొత్తంలో రిటైర్డ్ నేవీ అధికారుల నుంచి భారీ మొత్తంలో నోట్లను గుంజడమే కాకుండా.. డబ్బులు అడిగితే చంపేస్తామని బెదిరించడంతో ఆమెపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో ఏఆర్ సీఐ స్వర్ణలత అరెస్ట్ కావడం సంచలనం రేపింది. వృత్తిపరంగా అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె.. ప్రవృత్తిగా వెండితెరపై మక్కువ పెంచుకున్నారన్నది తాజా సమాచారం.

తనకు సినిమాలపై ఉన్న ఆసక్తితో.. స్వర్ణలత కొంతకాలం క్రితం ఓ తెలుగు పాటకు డ్యాన్స్ చేసింది. అది మరెవరి పాటో కాదు.. అప్పట్లో ఓ సంచలనంగా నిలిచిన చిరంజీవి పాట అబ్బనీ తియ్యని దెబ్బ పాట. తాజాగా ఆ వీడియో బయటకు రావడంతో.. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ అయితే.. ఇలాంటి డ్యాన్స్ నభూతో .. నభవిష్యత్ అనగా.. మరొకరు.. ఇక తెలుగు సినిమా హీరోయిన్లు బ్యాగులు సర్దుకోవాల్సిందే నంటూ వెటకారం చేశారు. సూపర్ హిట్ పాటను ఖూనీ చేసేశారని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
అయితే.. స్వర్ణలత AP31 మిస్సింగ్ అనే సినిమా చేస్తున్నట్లు పోస్టర్ కూడా రిలీజైంది. అందులో స్వర్ణలత పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తుండగా.. నెట్టింట పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆ సినిమాలో నటించాలంటే డ్యాన్స్ వచ్చి ఉండాలని ఓ ప్రజాప్రతినిధి చెప్పడంతో.. ఒక కొరియోగ్రాఫర్ ను పెట్టుకుని డ్యాన్స్ ప్రాక్టీస్ చేశారని, అందులో భాగంగానే ఈ అబ్బనీ తియ్యని దెబ్బ పాట వీడియో తీశారని తెలుస్తోంది. సీఐ స్వర్ణలత స్టెప్పేస్తే ఎలా ఉంటుందో.. మీరూ ఓ లుక్కేయండి.
Full View


Tags:    

Similar News