కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటాం

ఆంధ్రప్రదేశ్ లో ఆక్సిజన్ కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు

Update: 2022-01-10 06:38 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఆక్సిజన్ కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. అన్ని ఆసుపత్రుల ఆవరణలోనే ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేశామని చెప్ాపరు. యాభై పడకలు దాటిన ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ను ఏర్పాటు చేసినట్లు జగన్ వెల్లడించారు. 104 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 133 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేశామని చెప్పారు. కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో బాధితులకు ఆక్సిజన్ కొరత లేకుండా చేసేందుకు యుద్ధ ప్రాతిపదికపైన చర్యలు చేపట్టామన్నారు.

ఆక్సిజన్ ప్లాంట్లు....
కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని చర్యలు తాము తీసుకుంటున్నామని జగన్ చెప్పారు. వ్యాక్సినేషన్ ను కూడా యుద్ధప్రాతిపదికపై చర్యలు చేపట్టినట్లు జగన్ తెలిపారు. కరోనా థర్డ్ వేవ్ వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చర్యలు అన్నీ తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్లను జగన్ వర్చువల్ పద్ధతిలో జగన్ ప్రారంభించారు. వైద్య రంగంలో సమూలమైన మార్పులు తెచ్చేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పారు


Tags:    

Similar News