Chandrababu : నేడు చంద్రబాబు కీలక సమీక్ష
నేడు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి ఆహ్వానాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించనున్నారు
నేడు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి ఆహ్వానాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించనున్నారు. ప్రజాప్రతినిధులతో పాటు కూటమి నేతలతో టెలికాన్ఫరెన్స్ ను నిర్వహించనున్నారు. మే 2వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు వస్తున్న నేపథ్యంలో నేడు ఈ టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
ప్రతిపక్షాలకు ఆహ్వానంపై...
సీనియర్ నేతలు, కూటమి నేతలతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడి ప్రధాని సభకు ఎవరెవరిని ఆహ్వానించాలన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రతిపక్ష పార్టీలను పిలవడంపై నేడు క్లారిటీ రానుంది. అయితే ఏపీలో ప్రతిపక్షం కేవలం ఒక్కటే ఉండటం, మోదీ పర్యటనలో జగన్ కు ఆహ్వానం పంపాలా? వద్దా? అన్నది కూడా నేడు నిర్ణక్ష్ించనున్నారు. మిగిలిన పార్టీలకు కూడా ఆహ్వానాలు పంపే అంశంపై నేతలతో చంద్రబాబు చర్చించనున్నారు.