Chandrababu : అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఐఐటీ మద్రాస్ సహకరాంతో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తామని ముఖ్మమంత్రి చంద్రబాబు తెలిపారు

Update: 2025-03-28 12:40 GMT

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఐఐటీ మద్రాస్ సహకరాంతో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తామని ముఖ్మమంత్రి చంద్రబాబు తెలిపారు. 1995లో హైదరాబాద్ హైటెక్ సిటీని స్థాపించిన విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను ఏఐ, డీప్ టెక్నాలజీకి కేంద్ర బిందువుగా మార్చుతామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. భారతదేశంలో 65 శాతం మంది ఏఐ వినియోగిస్తున్నారని, ఇది ప్రపంచ సగటు 30 శాతం కన్నా అధికమన్నారు.

కొత్త సాంకేతికతతో...
ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి కొత్త సాంకేతికతలో విద్యార్థులు ముందుండాలని సూచించారు. చెన్నైలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మద్రాస్‌లో జరిగిన ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్- 2025కు సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సీఎం సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు.


Tags:    

Similar News