Chandrababu : నేడు తూర్పు గోదావరి జిల్లాకు చంద్రబాబు

నేడు తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు

Update: 2025-07-21 02:35 GMT

నేడు తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. రతన్ నాటా ఇన్నొవేషన్ హబ్ ను చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా జరిగే సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించనున్నారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో చంద్రబాబు నేతలతో కూడా సమావేశమయ్యే అవకాశముంది.

రతన్ నాటా ఇన్నొవేషన్ హబ్...
చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలను తరలించేందుకు పార్టీ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి. దీంతో పాటు చంద్రబాబు రానున్న ధవళేశ్వరం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజమండ్రి ఎయిర్ పోర్టులో దిగి అక్కడి నుంచి నేరుగా చంద్రబాబు ధవళేశ్వరం చేరుకుని ఇన్నొవేషన్ హబ్ ను ప్రారంభించనున్నారు.


Tags:    

Similar News